Sandeep Reddy Vanga; సందీప్ రెడ్డి వంగాతో ‘8వసంతాలు’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ సినిమా.. హీరో ఎవరంటే?

by Chukka Sudharani |

‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతిక సునీల్ కుమార్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sandeep Reddy Vanga; సందీప్ రెడ్డి వంగాతో ‘8వసంతాలు’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ సినిమా.. హీరో ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతిక సునీల్ కుమార్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా ఈ హీరోయిన్ ‘8 వసంతాలు’ సినిమాలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాలో అనంతిక ఓ కీలక పాత్రలో పోషించగా.. అందులోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో అనంతిక సునీల్ కుమార్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదిలా ఉంటే.. ‘8 వసంతాలు’ తర్వాత అనంతిక మరో సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు స్పిరిట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే.. ఈయన నిర్మాతగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని సందీప్ తన కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్‌లో నిర్మించబోతున్నట్లు టాక్. ఇందులో ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నడని తెలుస్తుండగా.. హీరోయిన్‌గా అనంతిక సునీల్ కుమార్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. అంతే కాకుండా ఈ సినిమా సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని టాక్.

Next Story