- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమర్షియల్ సినిమాల్లో 'బాషా'... డివైన్ మూవీస్ లో 'అనంత'
టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాబు అలాగే సుహాసిని ప్రధాన పాత్రల్లో చేసిన డివైన్ ఫిలిం అనంత. పుట్టపర్తి సాయిబాబా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాబు అలాగే సుహాసిని ప్రధాన పాత్రల్లో చేసిన డివైన్ ఫిలిం అనంత. పుట్టపర్తి సాయిబాబా ప్రేమతత్వం నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. దర్శకుడు సురేష్ కృష్ణ రూపొందించిన ఈ సినిమాను ఇన్నర్ వ్యూ బ్యానర్ పై గిరీష్ కృష్ణమూర్తి నిర్మించారు. అయితే, తాజాగా ఈ సినిమా ఆడియో అలాగే టీజర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ కృష్ణ మాట్లాడారు. ఒకరోజు గిరీష్ కృష్ణమూర్తి తనకు ఫోన్ చేశారన్నారు. బాబా గారి జీవితం పై సినిమా చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. బాబా గారి శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరినట్లు తెలిపారు. దాంతో మంచి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వెల్లడించారు. భాష సినిమా లాంటి కమర్షియల్ స్క్రిప్ట్ వచ్చిందని వివరించారు. బాబా గారి గురించి ఒక బయోపిక్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆశ్రమం కు కూడా వెళ్లినట్లు గుర్తు చేశారు.
దాంతో మంచి స్క్రిప్ట్ వచ్చిందని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు దర్శకులు సురేష్ కృష్ణ. అటు తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, సాయిబాబా తనను నమ్మిన వాళ్లందరినీ ప్రేమించాడని తెలిపారు. ఈ సినిమా కూడా అందరూ చూడాలని, చూస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా బాబా ప్రేమ సందేశం చాలామందికి చేరువవుతుందని వివరించారు. ఇంత మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాట రాసే అవకాశం తనకు రావడం అదృష్టం అని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాబా గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా తీసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు.






