- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Garividi Lakshmi: ఆ అమ్మి ఆడిపాడితే అంతే ఇక.. గరివిడి లక్ష్మి గ్లింప్స్‌తో సినిమాపై హైప్
యంగ్ నటి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గరివిడి లక్ష్మి’.

దిశ, సినిమా: యంగ్ నటి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గరివిడి లక్ష్మి’. 1990లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేసిన గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో గౌరీ నాయుడు జమ్మూ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో టైటిల్ పాత్రలో ఆనంది నటిస్తుండగా.. రాగ్ మయూర్, నరేష్, రాశి, శరణ్య, ప్రదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా పరిచయమవుతున్నారు.
ఇక రీసెంట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా ఆనంది పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హలో మైక్ టెస్టింగ్.. ఆ అమ్మి అడుగుపెడితే మన కుర్రాళ్లు ఎవరూ నేలపై నిలబరట.. ఆ అమ్మి పాట పాడితే పండు ముసలివాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారట.. ఆ అమ్మి గజ్జె కడితే మన ఊరంతా ఊగిపోద్దట’ అంటూ స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్‌లో.. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది జీవించేసిందనే చెప్పుకోవచ్చు. అంతే కాకుండా.. బుర్రకథ కళాకారిణి అయిన గరివిడి లక్ష్మి సంగీత వారసత్వానికి ఈ సినిమా ఓ నివాలిలాంటిదని చిత్ర బృందం ఇటీవల చెప్పగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం నెలకొంది. లింక్






