Anandalahari: ఆకట్టుకుంటున్న ఈస్ట్ గోదావరి అబ్బాయి వెస్ట్ గోదావరి అమ్మాయి పోస్టర్

by Chukka Sudharani |

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న లేటెస్ట్ అందమైన పల్లెటూరు ప్రేమ కథ ‘ఆనందలహరి’.

Anandalahari: ఆకట్టుకుంటున్న ఈస్ట్ గోదావరి అబ్బాయి వెస్ట్ గోదావరి అమ్మాయి పోస్టర్
X

దిశ, సినిమా: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న లేటెస్ట్ అందమైన పల్లెటూరు ప్రేమ కథ ‘ఆనందలహరి’. ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య జరిగే ఈ క్యూట్ లవ్ స్టోరీకి సాయి వనపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ బొడ్డేపల్లి హీరోగా.. ‘పెళ్లి చూపులు, వింధ్యా విహారి’ వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ బ్రమరాంబికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆనందలహరి’ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా సంస్థ.. ‘ఇదిగో మా ఈస్ట్ గోదావరి అబ్బాయి ఆనంద్.. అదిగో మా వెస్ట్ గోదావరి అమ్మాయి లహరి.. వీళ్లిద్దరి హడావిడి.. అక్టోబర్ 17 నుంచి సూసేద్దాం’ అంటూ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు. Link

Next Story