Anand Vardhan: ‘మెగాస్టార్ నా మాటలకు ఏడ్చేశారు’.. చిరుతో కలిసి నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-02-21 15:03:39  IST  )

టాలీవుడ్ ప్రముఖ నటుడు..కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Anand Vardhan: ‘మెగాస్టార్ నా మాటలకు ఏడ్చేశారు’.. చిరుతో కలిసి నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు..కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మెగాస్టార్ సినిమాలో ఏ చిన్న పాత్ర వచ్చినా చాలు అనుకునేవారు కోట్లలో ఉంటారు. అప్పట్లో ఎంతో మంది చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ప్రస్తుతం హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.

బెస్ట్ ఉదాహరణగా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చినా తేజ సజ్జా(Teja Sajja)నే చెప్పుకోవచ్చు. ఈ హీరో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటించి.. మొదటి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. చిన్న చిత్రంగా సంక్రాంతి బరిలో నిలిచి సెన్సేషనల్ హిట్ అందుకుంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

అయితే అనేక మూవీల్లో బాలనటుడిగా నటించి.. ప్రస్తుతం కథానాయకుడిగా.. ‘నిదిరించు జహాపన’ (Nidirinchu jahapana) అనే సినిమాతో ఆనంద్ వర్ధన్ నెటిజన్ల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో ఈ హీరో మాట్లాడుతూ.. వంశీ బర్కీలీ (Vamsi Berkeley) అనే అవార్డ్స్ టైంలో మనసంతా నువ్వే మూవీకి అవార్డు వచ్చిందని తెలిపాడు. అప్పుడు నాకు ఆస్కార్ అవార్డులాగా అనిపించిందని వెల్లడించాడు. అవార్డు తీసుకున్న అనంతరం నన్ను వేదికపై మాట్లాడమని అనగా.. నాకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఆస్కార్ అవార్డులా అనిపించిందని ఆనంద్ వర్ధన్ చెప్పుకొచ్చాడు.

నేను అలా చెప్పినాక చిరంజీవి ఎమోషన్ అయి.. ఏడ్చారని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఆనంద్ వర్ధన్ మెగాస్టార్‌తో కలిసి శ్రీ మంజునాథ, ఇంద్ర సినిమాలో నటించాడు. అలాగే ప్రేమించుకుందాం రా, ప్రియరాగాలు, సూర్యవంశం, పెళ్లి పందిరి, మావిడాకులు, మనసంతా నువ్వే, శ్రీ మంజునాథ వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు దక్కించుకున్నాడు ఆనంద్ వర్ధన్.

Next Story