ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: నవీన్ పొలిశెట్టి

by Sujitha Rachapalli |

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: నవీన్ పొలిశెట్టి
X

దిశ, సినిమా : సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ వేడుకలో జ్ఞాపికలను అందజేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పంపిణీదారులకు జ్ఞాపికలను అందించడం జరిగింది.

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాజు గారి పెళ్లి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది అరుదైన సంక్రాంతి. పెద్ద సినిమాలతో పాటు విడుదలై, మీ సినిమా నిలబడుతుందా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. ఇంతటి పోటీలో కూడా మా సినిమా నిలబడి, ఘన విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకులే. మీకు ఎంత కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మా సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, మా నవీన్ సినిమా వస్తుందని నమ్మి.. థియేటర్ కి వచ్చి సినిమా చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే నవీన్ పొలిశెట్టి అనే వ్యక్తి లేడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ వేదిక మీద నిల్చొని లాభాలు పొందామని చెప్పడం సంతోషాన్ని కలిగించింది’ అని తెలిపాడు.

Next Story