రండి.. భీమవరంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం.. టాలీవుడ్ హీరోయిన్ పిలుపు

by Chukka Sudharani |

నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’.

రండి.. భీమవరంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం.. టాలీవుడ్ హీరోయిన్ పిలుపు
X

దిశ, సినిమా: నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘అనగనగా ఒక రాజు’ నుంచి ‘భీమవరం బల్మా’ అని సాగే మొదటి పాట విడుదల కాబోతుంది. భీమవరం బల్మా బ్లాస్ట్ మ్యూజిక్‌తో మిక్కీ జే మేయర్ బ్లాస్ట్ చేయబోతున్నాడు’ అని తెలిపారు. అలాగే మీనాక్షీ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘భీమవరం.. మీ పవర్‌ను సిద్ధం చేసుకోండి.. అనగనగ ఒక రాజు నుండి మొదటి సింగిల్ భీమవరం బాల్మా నవంబర్ 27న విడుదల అవుతుంది.. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కళాశాలలో పాటల విడుదల కార్యక్రమానికి మాతో చేరండి. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ తెలిపింది. ప్రజెంట్ ఈ పోస్టర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక ఫస్ట్ సింగిల్‌కు నవీన్ పొలిశెట్టి ప్లే బ్యాక్ సింగర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. ఈ చిత్రం జనవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Next Story