జయంరవి-ఆర్తి విడాకులు విషయంలో ఊహించని ట్విస్ట్.. ఆ పోస్టులన్నీ తొలగించడంతో అంతా షాక్.. మళ్లీ కలిసిపోతున్నారా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-28 10:34:56  IST  )

కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi), ఆయన భార్య ఆర్తి(Aarti)కి విడాకులు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

జయంరవి-ఆర్తి విడాకులు విషయంలో ఊహించని ట్విస్ట్.. ఆ పోస్టులన్నీ తొలగించడంతో అంతా షాక్.. మళ్లీ కలిసిపోతున్నారా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi), ఆయన భార్య ఆర్తి(Aarti)కి విడాకులు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. నిత్యం ఈ జంట పలు సెన్సేషనల్ పోస్టులు పెడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటారు. ఇక ఇటీవల వీరిద్దరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్తి మూడో వ్యక్తి వల్ల విడాకులు తీసుకుంటున్నామని ఆరోపించింది. ఇక సింగర్‌ కెనిషా(Kenisha)తో డేటింగ్ చేస్తున్నాడని జయంరవిపై సంచలన పోస్ట్ కూడా పెట్టింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆర్తి మాత్రం సైలెంట్ కాలేదు. ఓ వైపు సోషల్ మీడియా వార్ చేసుకుంటూనే విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, జయం రవి, ఆర్తి డైవర్స్ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీరికి కోర్టు బిగ్ షాకిచ్చింది.

దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని ఆదేశించింది. దీంతో ఆర్తి తన మాజీ భర్తపై పెట్టిన పోస్టులన్నీ తొలగించింది. దీంతో ఇది చూసిన వారు కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారు కావచ్చు అని చర్చించుకుంటున్నారు. కానీ ఆర్తి పోస్ట్‌తో అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇక అసలు విషయం వెల్లడిస్తూ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘న్యాయాన్ని నిలబెట్టినందుకు గౌరవనీయ హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థ తాను చేయాల్సిన పనిని చేసింది. పరువు నష్టం నుండి రక్షించడం, అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని నిర్ధారించడం గొప్ప విషయం’’ అని రాసుకొచ్చింది. అలాగే కోర్టు ఆదేశించిన నోట్‌ను షేర్ చేసింది.

Next Story