- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల అత్యవసర సమావేశం... ఈరోజైనా కొలిక్కి వచ్చేనా??
హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో నేడు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో నేడు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ రవి, నాగ వంశీ, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య వంటి 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమావేశం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగస్టు 4 నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు ఈ అత్యవసర భేటీ జరిగినట్టు సమాచారం.
కాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సినీ కార్మికులకు 30% వేతన పెంపుతోపాటు, రోజువారీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ షూటింగ్‌లను నిలిపివేసింది. నిర్మాతలు ప్రతిపాదించిన నాలుగు కీలక షరతులపై (ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఫిక్స్‌డ్ కాల్ షీట్స్, నాన్-యూనియన్ సిబ్బంది నియామకం, రేషియో సిస్టమ్‌పై అభ్యంతరం లేకపోవడం, ప్రభుత్వ హాలిడేస్ కు రెండో ఆదివారాలకు మాత్రమే డబుల్ వేతనం)పై ఫెడరేషన్ ఇప్పటికే సానుకూలంగా స్పందించింది.
కానీ వేతన పెంపుపై 20% తక్షణ పెంపు, మిగిలిన 10% రెండేళ్లలో పది శాతం చొప్పున పెంచాలని సవరించిన ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. నేడు జరుగుతున్న సమావేశం కూడా ప్రధానంగా ఈ అంశాన్ని చర్చించేందుకేనని తెలుస్తోంది.






