- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yash: నా కొడుకును స్టైలిష్‌గా చూడాలని ఉంది.. కానీ అలా చేస్తే ఎవరు చూస్తారు.. స్టార్ హీరో తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కన్నడ స్టార్ యశ్ (Yash) ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్-2’ (KGF-2) సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ యశ్ (Yash) ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్-2’ (KGF-2) సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రజెంట్ ఈయన ‘టాక్సిక్’ (Toxic), ‘రామాయణం’ (Ramayana) వంటి సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ కన్నడ స్టార్ తల్లి పుష్ప రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యశ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘యశ్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.. కేజీఎఫ్, టాక్సిక్ వంటి సినిమాలు చేస్తున్నారు.. ఒకప్పుడు కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేసేవారు.. అయితే.. మీకు యశ్‌ను ఎలాంటి సినిమాల్లో చూడాలని అనిపిస్తుంది’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. యశ్ తల్లి పుష్ప స్పందిస్తూ..
‘వాడు చేసే అన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అయితే.. యశ్‌ను ఎప్పుడు స్టైలిష్‌గా చూడటానికి నేను ఇష్టపడతాను. కానీ వాడు అలా చెయ్యడు. అలా చేస్తే ఎవరు చూస్తారు నీకోసం సినిమా చెయ్యాలా నేను అంటాడు. వాడు చాలా బాగా కనిపించాలి అందంగా ఉండాలి, స్టైలిష్‌గా ఉండాలి అనుకుంటాను. ఇప్పుడు నేను కూడా అలవాడు పడిపోయాను’ అంటూ మొత్తం తెలుగులో మాట్లాడారు. ప్రజెంట్ యశ్ తల్లి పుష్ప కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Like every other mom, #Yash's mother also wants her son to be neatly dressed and well-groomed for the camera. And like every other son, Yash is often reluctant.....
— Gulte (@GulteOfficial) May 21, 2025
Speaking at the teaser launch of her maiden production #Kothalavadi, his mother ‘Pushpa ArunKumar’ shared this… pic.twitter.com/6aUf68OGmT






