- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో విష్ణు విశాల్ - గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టిన అమీర్ ఖాన్.. బ్యూటిఫుల్ పిక్స్..
హీరో విష్ణు విశాల్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. మొదటి వివాహంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉంటున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు

దిశ, వెబ్ డెస్క్: హీరో విష్ణు విశాల్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. మొదటి వివాహంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉంటున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఈ దంపతులకు కూతురు పుట్టగా.. నామకరణ మహోత్సవానికి అతిథిగా హాజరయ్యాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. తమ కూతురికి మీరా అని పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన దంపతులు.. చాలా ఎమోషనల్ అయ్యారు. దీన్ని మరపురాని జ్ఞాపకంగా అభివర్ణించారు.
ఇక ఈ ఫొటోలలో జ్వాల ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం.. అమీర్, విశాల్ హగ్ చేసుకోవడం.. అమీర్ మీరాను ఎత్తుకోవడం.. చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం అమీర్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మహాభారత్ మూవీ మొదలు పెట్టే సన్నాహాల్లో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘సితారే జమీన్ పర్’తో సక్సెస్ అందుకున్నాడు అమీర్.






