Ameesha Patel: సల్మాన్‌ ఖాన్ తో అందమైన పిల్లలను కంటా.. స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్!

by Vennela |

Ameesha Patel: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో అమీషా పటేల్(Ameesha Patel) ఒకరు.

Ameesha Patel: సల్మాన్‌ ఖాన్ తో అందమైన పిల్లలను కంటా.. స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: Ameesha Patel: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో అమీషా పటేల్(Ameesha Patel) ఒకరు. దాదాపు 5 పదుల వయస్సు వచ్చినా కూడా ఆమెలో ఎనర్జీ లెవల్స్ కానీ..అందం కానీ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింద. 48ఏళ్ల అమీషా పటేల్(Ameesha Patel) కు ఇంకా పెళ్లి కాలేదని అందరికీ తెలిసిందే. ఆ మధ్య తనకు రహస్యంగా పెళ్లి జరిగినట్లు కూడా తన సీక్రెట్ ను బయటపెట్టింది. తనకు పెళ్లి అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు, ఎక్కడ ఎవరిని పెళ్లి చేసుకుందో కూడా చెప్పింది. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కెరీర్ గురించి...ఆమె ప్రేమ గురించి చాలా విషయాలే చెప్పుకొచ్చింది. తాను ఎవరితో ప్రేమలో ఉన్నానో కూడా చెప్పింది. నిజజీవితంలో తనకు పెళ్లి కాకపోయినా భర్తగా అంగీకరించిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా ఒకప్పుడు.

అయితే పెళ్లి గురించి అమీషా పటేల్(Ameesha Patel) ను అభిమానులు తరుచుగా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇటీవల అమీషా తన ఇంటర్వ్యూలో ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నల గురించి ప్రస్తావించారు. ఇందులో సల్మాన్ ఖాన్(Salman Khan) తో అమీషా పటేల్ ను పెళ్లి చేసుకోమని.. పిల్లలను కనడం గురించి మాట్లాడింది. అందమైన వ్యక్తులతో జీవితం పంచుకోవడం ప్రేక్షకులకు నచ్చుతుందని అమీషా కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్‌తో తన పెళ్లికి సంబంధించి అభిమానుల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలకు అమీషా పటేల్ సమాధానమిచ్చింది. ట్విట్టర్‌లో కొందరు అభిమానులు సల్మాన్‌ను పెళ్లి చేసుకుని అందమైన పిల్లలను కనాలని చెప్పారని అమీషా తెలిపింది.

సల్మాన్ ఖాన్, అమీషా పటేల్ ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ బబుల్‌తో మాట్లాడుతూ... అమీషా దీనికి సంబంధించి అభిమానుల కోరికల గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఓ నెటిజన్ ఇలా అడిగాడు..అంటూ .. నన్ను ఆస్క్ మీ ట్విట్టర్ చాట్‌లో ఈ ప్రశ్న అడిగారు. మీరు అందంగా ఉంటారు. సల్మాన్ ఖాన్ కూడా అందంగా ఉంటారు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని.. అందమైన పిల్లలను కనండి అంటూ అడిగారట. ఈ విషయాన్ని అమీషా నవ్వుతూ వావ్, మీరు అనుకున్నది నిజమే. అందమైన వ్యక్తులు కలిసి ఉండటం కూడా ప్రపంచం ఇష్టపడుతుందని నేను భావిస్తున్నాను. కహో నా ప్యార్‌ హై తర్వాత నేను, హృతిక్‌ కలిసి ఉండాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ హృతిక్‌ పెళ్లి గురించి చెప్పగానే చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అని చెప్పింది.

అంతేకాదు అమీషా, సల్మాన్ ఇద్దరూ ఇంకా పెళ్లిచేసుకోలేదని ఓ అభిమాని ఎగతాళి చేసి మాట్లాడట. అయితే ఆ అభిమాని ప్రశ్నకు సమాధానం చెబుతూ వారిద్దరూ పెళ్లిచేసుకునే ఛాన్స్ ఉందా? అని సదరు అభిమానిని సరదాగా అడిగినట్లు చెప్పింది. సల్మాన్ కు, నాకు పెళ్లి కాలేదు కాబట్టి..మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అని అడిగిందట. అదంతా సినిమాలకే పరిమితం. నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని చెప్పింది. కాగా అమీషా పటేల్, సల్మాన్ ఖాన్ జంటగా 'యే హై జల్వా' (2002)లో నటించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, వారి జోడీ ప్రేక్షకులకు నచ్చింది. ఇటీవల అమీషా సన్నీ డియోల్‌తో కలిసి 'గదర్ 2'లో కనిపించింది.

Next Story