- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత్రల కోసం పడుకోలేదు.. అందుకే అవకాశాలు రావట్లేదు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన బ్యూటీ క్వీన్ అమీషా పటేల్.. సడెన్‌గా డిజప్పియర్ అయింది. తెలుగులో బద్రి, నాని లాంటి సినిమాల్లో మెరిసి.. అందానికే అందం నిర్వచనం గురించి చెప్పిందనే ప్రశంసలు అందుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన బ్యూటీ క్వీన్ అమీషా పటేల్.. సడెన్‌గా డిజప్పియర్ అయింది. తెలుగులో బద్రి, నాని లాంటి సినిమాల్లో మెరిసి.. అందానికే అందం నిర్వచనం గురించి చెప్పిందనే ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కానీ ఆ తర్వాత కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత ‘గదర్ 2’లో కనిపించిన ఆమె.. అవకాశాలు ఎందుకు రాలేదో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ తనను ఎందుకు వేరుగా చూస్తుందో వివరించింది. బాలీవుడ్ ఇన్‌సైడర్స్ తనను ఇష్టపడరని.. కారణం పాత్రల కోసం పడుకునే క్యారెక్టర్ తనది కాదని చెప్పింది అమీషా. మందు తాగనని, పార్టీలకు హాజరు కానని.. అందుకే అవుట్ సైడర్‌గా ట్రీట్ చేస్తారని, ఈ కారణంగా చాలా అవకాశాలను కోల్పోయానని తెలిపింది. సాధారణ హీరోయిన్ల మాదిరిగా రాజీపడకుండా.. ఇందుకు విరుద్ధంగా ఉండటంతో ఇండస్ట్రీ నుంచి వెలివేశారని, ఇప్పటికీ ఛాన్స్‌లు రావట్లేదని వివరించింది. ఇండైరెక్ట్‌గా నెపోటిజం, ఫేవరెట్‌నెస్ గురించి కామెంట్స్ చేసిన ఆమె.. ప్రతిభ, ప్రేక్షకుల మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పింది.






