- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అమరావతికి ఆహ్వానం’.. ఫిబ్రవరి 13 విడుదల
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

దిశ, సినిమా : శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత - నటులు మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు. "అమరావతికి ఆహ్వానం" సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ - ''నిర్మాత వెంకటేశ్వరరావు గారు మా బావగారు. ఆయన అడగటంతో ఈ సినిమాలో నటించాను. సినిమాలో నటిస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే కంటెంట్ చాలా బాగుందని అనిపిస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ జీవీకేగారు ఈ సినిమాను రూపొందించాడు. "అమరావతికి ఆహ్వానం" సినిమా మా టీమ్ అందరికీ విజయాన్ని అందించాలి'' అన్నారు.
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" చిత్రంలో నేను ఫస్ట్‌టైమ్ ఒక పిచ్చివాడి క్యారెక్టర్ లో నటించాను. ఆ క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్, హారర్ మూవీస్..ఈ మూడు జానర్ మూవీస్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మా "అమరావతికి ఆహ్వానం" సినిమాను కూడా మీరంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ '' అన్నారు.






