- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతికి ఆహ్వానం.. సినిమా అప్డేట్
ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిచ్చేలా రూపొందిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని,ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర

దిశ, సినిమా : ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిచ్చేలా రూపొందిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని,ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శర వేగంగా జరుపుకుంటోంది. అతి త్వరలో భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో సరిక్రొత్త పోస్టర్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో శివ కంఠంనేని.. దర్శకుడు జీవికే తన విజన్ తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువచ్చారని.. తప్పకుండా థియేటర్స్‌లో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతినిస్తుందని తెలిపాడు.






