Amar -Tejaswini: పెళ్లి తర్వాత మేము హ్యాపీగా లేము.. బిగ్ బాంబ్ పేల్చిన సీరియల్ జంట(వీడియో)

by I. Sairam |   (  Updated:2025-07-26 02:42:22  IST  )

బుల్లితెర కపుల్ అయినటువంటి అమర్, తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Amar -Tejaswini: పెళ్లి తర్వాత మేము హ్యాపీగా లేము.. బిగ్ బాంబ్ పేల్చిన సీరియల్ జంట(వీడియో)
X

దిశ, సినిమా: బుల్లితెర కపుల్ అయినటువంటి అమర్, తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ సీరియల్ జంట ఎంతో మందికి ఆదర్శం. అబ్బా.. చూడముచ్చటైన జంట.. మొగుడు పెళ్లాలు అంటే ఇలా ఉండాలి అని అనిపించే కపుల్ అమర్, తేజస్విని. ముఖ్యంగా అమర్ దీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తేజస్విని పెద్ద యుద్దమే చేసింది. భర్తకు అండగా నిలిచి.. హౌస్‌లో అమర్ దీప్ ఆడుతుంటే.. బయట ట్రోలింగ్‌ని తట్టుకుని నిలబడింది. భర్తకి తగ్గ భార్య అనిపించింది. అలాంటి అన్యోన్యమైన జంట హ్యాపీగా లేరంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

స్టార్ మా చానెల్లో ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘ఇస్మార్ట్ జోడి’(సీజన్-3). శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి ఈ వారం వెడ్డింగ్ కాన్సెప్ట్‌తో ప్రోమో వదిలారు. అయితే ఈ ప్రోమోలో ఓంకార్.. అమర్ దీప్, తేజస్వినిను ‘మీరిద్దరూ భార్యాభర్తలుగా 100 పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా? లేదంటే.. ఒక చైర్ వదిలేసి కూర్చోండి’ అని అన్నాడు. దీంతో అమర్ దీప్, తేజస్వినిలు ఒక చైర్ కాదు.. రెండు చైర్లు వదిలేసి కూర్చున్నారు. ఇంతటితో ఈ ప్రోమో అయిపోతుంది. మరి ఈ జంట నిజంగానే హ్యాపీగా లేరా అనేది తెలియాలంటే ఫుల్ ఏపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫిట్టింగ్ పెట్టావ్ కదా ఓంకార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story