అమర్ దీప్- సుప్రీత నటిస్తున్న సినిమా టైటిల్-గ్లింప్స్ రిలీజ్.. చూస్తే వావ్ అనాల్సిందే..

by I. Sairam |   (  Updated:2025-08-01 15:56:51  IST  )

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్(Amardeep), స్టార్ యాక్టర్ సురేఖ వాణి(Surekha Vani) కూతురు సుప్రీత(Supreetha) జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అమర్ దీప్- సుప్రీత నటిస్తున్న సినిమా టైటిల్-గ్లింప్స్ రిలీజ్..  చూస్తే వావ్ అనాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్(Amardeep), స్టార్ యాక్టర్ సురేఖ వాణి(Surekha Vani) కూతురు సుప్రీత(Supreetha) జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి మల్యాద్రి రెడ్డి(Malyadri Reddy) దర్శకత్వం వహిస్తుండగా.. M3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్‌తో కలిసి మహేంద్రనాథ్ కొండ(Mahendra Nath Konda) నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో రోహిత్, రాజా రవీంద్ర, రాసి, వినోద్ కుమార్, ఎస్తర్, రూప లక్ష్మి, గీత సింగ్, మెహబూబ్ బాషా, జబర్దస్త్ సత్య శ్రీ, టేస్టీ తేజ.. ఇలా చాలా మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ చిత్రానికి 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’(Chowdary Gari Abbayitho Nayudu Gari Ammayi) అనే టైటిల్‌ని ప్రకటించారు. దీంతో ఈ టైటిల్ కాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు టైటిల్ అదిరిపోయిందంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా రియల్ లైఫ్‌లో కూడా టైటిల్‌కి తగ్గట్టు అమర్ దీప్ – సుప్రీత ఇద్దరి క్యాస్ట్‌లు అవే కావడం విశేషం. ఇక గ్లింప్స్‌లో అమర్ అండ్ సుప్రితల కెమిస్ట్రీ చాలా ఆకట్టుకుంది. ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. మరి ఈ సినిమాతో ఇండస్ట్రీకి హీరో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ జంటకు ఈ చిత్రం మంచి కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.

Click For Video..

Next Story