Amani: ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం.. సీనియర్ నటి ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

మురళీ మోహన్ (Murali Mohan), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’

Amani: ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం.. సీనియర్ నటి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మురళీ మోహన్ (Murali Mohan), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

అంబికా కృష్ణ (Ambika Krishn) మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని, విషయాల్ని సినిమాల ద్వారా చూపిస్తే అందరికీ తెలుస్తుంది. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది. ఆమె ఆర్టిస్ట్ కాదు హార్టిస్ట్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాంబాబు, దర్శకుడికి ఆల్ ది బెస్ట్. ఇదొక గొప్ప చిత్రం కానుందనిపిస్తుంది’ అని అన్నారు.

ఆమని (Amani) మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ కథను చెప్పినప్పుడు.. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. దీంతో గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు అర్థమైంది. ఇలాంటి పాత్రలను చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. మురళీ మోహన్‌తో నటిస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

Next Story