- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మనమెప్పుడు ఇంత బాగా ప్రవర్తించే వాళ్లం కాదు’.. పిల్లల క్యూట్ లుక్స్ పంచుకుంటూ అమలాపాల్ పోస్ట్
హీరోయిన్ అమలాపాల్ 2023లో వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అమలాపాల్ 2023లో వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది. ఆమె గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అమలాపాల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది. అందులో తన భర్త జగత్ దేశాయ్ గురించి వివరించింది. ఎలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నదనే విషయాలు చెప్పుకొచ్చింది.
వీరు 2024లో పండండి మగబిడ్డకు జన్మనిచ్చి కుటుంబంలో సంతోషాన్ని నింపింది. అమలాపాల్ రీసెంట్‌గా తన కొడుకును క్రైస్తవ మతంలోకి మార్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకను చర్చ్‌లో ఘనంగా జరిపింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా అభిమానులతో పంచుకుంది. అయితే నిన్న కుమారుడ్ని క్రైస్తవ మతంలోకి మార్చిన పలు ఫొటోలను నిన్న పంచుకోగా.. నేడు తన కొడుకు కొంతమంది పిల్లలతో ఆడుకుంటోన్న ఫొటోలు తాజాగా పంచుకుని.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఈ పిల్లల అమాయకత్వం, క్యూట్‌నెస్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. క్యూట్ లుక్స్‌లో చంపుతోన్న ఈ పోస్ట్‌ను అమలాపాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా పలువురు పలు రకాలుగా క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే అమలాపాల్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.






