సైలెంట్‌గా దూసుకెళ్తున్న 'ఆల్ఫా'.. అలియా భట్ ఖాతాలో మరో ఘనత!

by Pulgam srinivas |

'ఆల్ఫా' చిత్రానికి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹100.16 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

సైలెంట్‌గా దూసుకెళ్తున్న ఆల్ఫా.. అలియా భట్ ఖాతాలో మరో ఘనత!
X

దిశ, వెబ్ డెస్క్: అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆల్ఫా'. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించాడు. శివ్ రవైల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 3, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపదని చాలా మంది భావించారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, 'ఆల్ఫా' విడుదలైన 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹100.16 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక పూర్తి థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ఎలాంటి ఫైనల్ కలెక్షన్లు నమోదు చేస్తుందో బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




Next Story