Allu Arjun ‘Pushpa2’.. కీలక పాత్రలో నటిస్తున్న Ramya Krishna!

by Disha Web Desk 6 |
Allu Arjun ‘Pushpa2’.. కీలక పాత్రలో నటిస్తున్న Ramya Krishna!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా పుష్ప-2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప తో బాగా క్రేజ్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 తో మరింత క్రేజ్ ను తెచ్చుకోవాలని భారీ బడ్జెట్ లో చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

తాజాగా, ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే పుష్ప 2 లోకి సుకుమార్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణను కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పాత్ర కోసం చాలామంది సెలబ్రిటీలను సెలెక్ట్ చేశారట. కానీ కళ్ళల్లో గాంభీర్యం, మాటల్లో పొగరు కనిపించేలా ఉండే రమ్యకృష్ణ అయితేనే ఈ పాత్రకు బాగా సెట్ అవుతుందని ఇలా ప్లాన్ చేస్తున్నారట. తెరపై అల్లు అర్జున్, రమ్యకృష్ణ సీన్లు అదిరిపోతాయని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు ఇందులో రమ్మకృష్ణ నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : బ్రో.. ఐ డోంట్ కేర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి సాలిడ్ వీడియో రిలీజ్


Next Story