AA: నేను అహంకారంతో మాట్లాడటం లేదు.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
AA: నేను అహంకారంతో మాట్లాడటం లేదు.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 premiere show) సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై హీరో అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి స్పందించారు. శనివారం పుష్ప-2 సక్సెస్ మీట్‌లో మాట్లాడారు. దాదాపు మూడేళ్ల తర్వాత పబ్లిక్‌లో సినిమా చూడాలి అనిపించి సంధ్య థియేటర్‌కు వెళ్లానని అన్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఫ్యామిలీకి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చారు.

తమపై నమ్మకంతో సినిమాను నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. తన నటనను ఎంత పొగిడినా అదంతా డిజైన్‌ చేసింది సుకుమారే.. సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలని అన్నారు. తాను అహంకారంతో చెప్పటం లేదు. వసూళ్లు విషయం పక్కన పెడితే, ‘పుష్ప’పై అభిమానం, ప్రేమను వెలకట్టలేం. ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలైన మా ప్రయాణం ఇప్పుడు ఇండియా మొత్తం వెళ్లింది. టికెట్‌ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed