- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పైసీ లుక్స్‌లో అల్లు అర్జున్ బ్యూటీ.. మూడ్‌లో ఉన్నానంటూ అలాంటి ఫొటోలు షేర్ చేసి షాకిచ్చిన హీరోయిన్..
‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ రేంజ్‌కి ఎదిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది ఈ భామ. కానీ అనుకున్నంతగా అయితే హిట్స్ కాలేవు. దీంతో కొన్ని రోజులు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే రీసెంట్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘పుష్ప-2’(Pushpa-2) మూవీలో ‘కిస్సిక్’(Kisssik) సాంగ్‌లో చిందులేసింది. ఇలా ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క చదువును కూడా కంటిన్యూ చేస్తుంది.
అలాగే సోషల్ మీడియా(Social media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ అండ్ బ్లూ కలర్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకొని స్పైసీ లుక్‌లో ఫొటోలకి పోజులిచ్చింది. అంతేకాకుండా వీటికి ‘మీ గర్ల్ మూడ్‌లో ఉంది.. ఈ పిక్స్‌లో మీ ఫేవరెట్ వన్ ఏది’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు తమకు నచ్చిన ఫొటో ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.






