- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sneha Reddy: నాకు ఏం కావాలంటూ.. హాస్పిటల్ బెడ్‌పై బ్లడ్ ఎక్కిస్తోన్న ఫొటో పంచుకున్న ఐకాన్‌స్టార్ సతీమణి..?
టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Sneha Reddy)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Sneha Reddy)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమెకు కూడా హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. తరచూ అయాన్ (Ayan), అర్హ (Arha) వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. వెకేషన్‌కెళ్లినా.. ఇంట్లో ఫంక్షన్స్‌వి అయినా, అర్హ క్యూట్ క్యూట్ వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
ఇక అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా సమయాన్ని కేటాయిస్తాడు. పుష్ప రెండు భాగాలతో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్‌కు చేరిపోయిందనడంలో అతిశయోక్తిలేదు. అద్భుతమైన యాక్టింగ్‌తో ఇరగదీశాడు. పుష్ప సినిమాకు ఏకంగా బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Award) కూడా వచ్చింది.
దీంతో అల్లు ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఐకాన్‌స్టార్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటో పంచుకుంది. బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఫొటోలో ఉంది. నాకు ప్రస్తుతం ఏమి కావాలి అంటూ ఓ క్యాప్షన్ కూడా ఈ ఫొటోకు జోడించి ఉంది. మరీ ఈ పిక్‌లో ఉన్నదనేది క్లారిటీగా తెలియదు. స్నేహా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వీక్షించిన అల్లు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






