Allu Arjun: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్.. ఏకంగా ఆ హిట్ డైరెక్టర్‌తో సినిమా..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-13 11:49:02  IST  )

‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Allu Arjun: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్.. ఏకంగా ఆ హిట్ డైరెక్టర్‌తో సినిమా..?
X

దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ‘పుష్ప’(Pushpa) మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక రీసెంట్ పుష్పకి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)తో మన ముందుకు వచ్చి ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా ప్రస్తుతం రూ.1900 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో బన్నీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌(Trivikram)తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) చెప్పి.. ఈ మూవీపై మరింత హైప్ పెంచేశాడు. ఈ క్రమంలో బన్నీకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సారి బన్నీ బాలీవుడ్‌(Bollywood)లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హిట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali)ని అల్లు అర్జున్ ముంబై వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story