- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుష్ప 3 సినిమా నుంచి క్రేజీ అప్డేట్..ఇక ఫ్యాన్స్ కు పండగే !
హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లీజుకు తీసుకొని మరి దీనిపై వర్క్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

పుష్ప 3
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి సక్సెస్ అందుకుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇండియాలోనే కాకుండా జపాన్ లాంటి దేశాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఎర్రచందనం కథాంశంతో వచ్చిన ఈ సినిమా థర్డ్ పార్ట్ కూడా రానుంది. పుష్ప 3 పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీ గురించి కీలక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా స్క్రిప్ట్ చాలా వేగంగా రెడీ చేస్తున్నారట. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లీజుకు తీసుకొని మరి దీనిపై వర్క్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూడవ సినిమాలో తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ప్రాణాలతో బతికి బయటపడ్డ పుష్పరాజ్, ఎలా కైవసం చేసుకుంటాడు ? అనే స్టోరీ చుట్టూ తిరుగనుందని టాక్. ఈ సందర్భంగా శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ అంతు చూస్తాడట. కాగా ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి వరకు ప్రారంభం కానున్నట్లు టాక్ నడుస్తోంది.






