ప్రభాస్ స్పిరిట్ సినిమాకు బ‌న్నీ ప్ర‌చారం..రెబ‌ల్ టీ-ష‌ర్ట్ వేసుకుని మ‌రీ !

by velandi.Saikiran |

అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీ షర్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెబల్, స్పిరిట్ అని రాసి ఉన్న టీ షర్ట్ ను అల్లు

ప్రభాస్ స్పిరిట్ సినిమాకు బ‌న్నీ ప్ర‌చారం..రెబ‌ల్ టీ-ష‌ర్ట్ వేసుకుని మ‌రీ  !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛ‌త్రపతి, బాహుబలి లాంటి సినిమాలు చేసి, పాన్‌ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. అయితే అలాంటి ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో కబీర్ సింగ్ గా మెరిసిన షాహిద్ క‌పూర్‌ కూడా ప్రత్యేక రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీ షర్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెబల్, స్పిరిట్ అని రాసి ఉన్న టీ షర్ట్ ను అల్లు అర్జున్ ధ‌రించాడు. అది ఇప్పుడు కూడా కాదు, సరిగ్గా 10 సంవత్సరాల కింద‌టే, రెబల్, స్పిరిట్ పేరుతో ఉన్న టీ షర్ట్ ను ధరించాడు అల్లు అర్జున్. దీంతో ప్రభాస్ సినిమాకు అల్లు అర్జున్ ప్రచారం మొదలు పెట్టాడని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే 10 సంవత్సరాల కిందటే స్పిరిట్ గురించి అంచనా వేసి, ఆ టీ-ష‌ర్ట్‌ ధరించాడని మరి కొంతమంది అంటున్నారు. దీంతో మొత్తానికి రెబల్ స్టార్ టీ షర్ట్ వేసుకున్న అల్లు అర్జున్ వీడియో వైరల్ గా మారింది.

Next Story