- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: రోజుకో రికార్డ్ బ్రేక్ చేస్తున్న అల్లు అర్జున్ .. హిందీలో తగ్గేదే లే అంటున్న పుష్ప 2 కలెక్షన్స్ ..
హిందీ ప్రేక్షకులు 'పుష్ప2' ను ఓన్ చేసుకున్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించి నార్త్ లో కూడా దూసుకెళ్తుంది. హిందీ ప్రేక్షకులు 'పుష్ప2' ను ఓన్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. డిసెంబర్ 05 న గ్రాండ్ గా రిలీజ్ అయిన విడుదలైన ఈ మూవీ మొదటి రోజు హిందీలో రూ.72 కోట్ల కలెక్షన్లు మాత్రమే వసూలు చేయగా.. మూడో రోజు రూ.74 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేయగా, నాలుగో రోజు ఏకంగా రూ. 86 కోట్లను వసూలు చేసింది . డే వన్ తో పోల్చుకుంటే నాలుగో రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి. హిందీలో నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.286 కోట్లు రాబట్టిన మొదటి తెలుగు చిత్రంగా 'పుష్ప2' నిలిచింది.






