డైరెక్టర్లకు స్ట్రిక్ట్ రూల్ పెట్టిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి

by Pulgam srinivas |

అల్లు అర్జున్ ఇకపై ఏ సినిమానైనా 200 రోజుల్లోనే పూర్తి చేయాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్లకు స్ట్రిక్ట్ రూల్ పెట్టిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలు ఖచ్చితమైన సమయంలో పూర్తి కావాలని, అనుకున్న సమయానికి విడుదల కావాలనే ఉద్దేశంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇకపై చేయబోయే ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 200 రోజులు మాత్రమే షూటింగ్ సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ 200 రోజుల్లో షూటింగ్ పూర్తి కాకపోతే, ఆ సినిమాతో పాటు మరో ప్రాజెక్టును కూడా ప్రారంభించి, రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. అలాగే 2027 ఏప్రిల్ నెలలో మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇలా వరుసగా భారీ ప్రాజెక్టులకు కమిట్ అవుతున్న నేపథ్యంలో, ప్రతి సినిమాను 200 రోజుల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం కొంతమంది దర్శకులకు సవాలుగా మారినప్పటికీ, అభిమానులు మాత్రం తమ హీరో సినిమాలు త్వరగా విడుదల అవుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story