- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
పుష్ప 2 సినిమా ( Pushpa 2) రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ ( Sandhya Theatre) దగ్గర గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను (

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప 2 సినిమా ( Pushpa 2) రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ ( Sandhya Theatre) దగ్గర గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను ( Sri tej) అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ( Allu aravind) పరామర్శించారు. ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి బాలుడు శ్రీ తేజ్ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతని శరీరంలో కదలికలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ హాస్పిటల్ కు శ్రీ తేజ్ ను తరలించారు. పంజాగుట్ట లోని ఓ ప్రముఖ ఫిజియోథెరపీ సెంటర్ కు శ్రీ తేజ్ ను తరలించినట్లు తెలుస్తోంది.
15 రోజులపాటు ఫిజియోథెరపీ అప్లై చేస్తే శ్రీ తేజ్ కోరుకుంటాడని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే... ఆసుపత్రిలో ఉన్న బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్, బన్నీ వాసు. ఈ సందర్భంగా శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ మెరుగైన చికిత్స అందించాలని... ఈ సందర్భంగా అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. అప్పటినుంచి శ్రీ తేజ్ వైద్యం ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ భరిస్తున్నాడని తెలుస్తోంది.
పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ https://t.co/Kf7dNbqq5g pic.twitter.com/bqAXqymvRS
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2025






