Allu Arjun: 'పుష్ప' తర్వాత పూర్తిగా గెటప్ మార్చిన ఐకాన్ స్టార్.. ఆకట్టుకుంటున్న న్యూ లుక్

by Gugulothu.Kavitha |

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2).

Allu Arjun: పుష్ప తర్వాత పూర్తిగా గెటప్ మార్చిన ఐకాన్ స్టార్.. ఆకట్టుకుంటున్న న్యూ లుక్
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2). ఇది ‘పుష్ప’(Pushpa)కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల‌కు పైగా కలెక్ట్ చేసి ఎన్నో రికార్డులను తిరగరాసింది. కాగా ఇక ఈ మూవీ రిలీజ్ టైంలో ఎన్నో వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే పుష్ప-2 రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సందర్భంగా చిత్రబృదం శనివారం సాయంత్రం థాంక్యూ మీట్(Thank You Meet) నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌‌గా వచ్చిన అల్లు అర్జున్ లుక్ పూర్తిగా మారిపోయి కనిపించింది. పుష్ప-2 కోసం గడ్డం, జుట్టు భారీగా పెంచిన బన్నీ ప్రజెంట్ లుక్ మార్చారు. ఇందులో భాగంగా గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలీష్‌గా కనిపించారు.

అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత మీడియాకు దూరమైన బన్నీ.. తాజాగా ఈ లుక్‌తో కనబడేసరికి అతని ఫొటోలను నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియా(Social Media) వేదికగా షేర్ చేస్తూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నెక్ట్స్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌(Trivikram)తో ఓ భారీ బడ్జేట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే రానున్నట్లు సమాచారం.


Next Story