అల్లు అర్హ వరల్డ్ రికార్డ్

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-29 11:08:35  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హకు ఇప్పటికే ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రి షేర్ చేసిన క్యూట్ వీడియోలతో అభిమానులను సంపాదించిన ఈ ప్రెట్టీ గర్ల్.. ‘శాకుంతలం’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ మంచి మార్కులే కొట్టేసింది. తెలుగు మాట్లాడే

అల్లు అర్హ వరల్డ్ రికార్డ్
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హకు ఇప్పటికే ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రి షేర్ చేసిన క్యూట్ వీడియోలతో అభిమానులను సంపాదించిన ఈ ప్రెట్టీ గర్ల్.. ‘శాకుంతలం’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ మంచి మార్కులే కొట్టేసింది. తెలుగు మాట్లాడే విధానానికి ప్రశంసలు కూడా అందుకుంది. ఇదంతా పక్కన పెడితే ఇంత చిన్న వయసులోనే అర్హ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్, 30 పజిల్స్ సాల్వ్ చేయడంలో 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఆమె బ్రిలియంట్ స్కిల్స్‌కు నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మొత్తానికి ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. తండ్రికి తగిన కూతురిగా ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్ స్టార్ డమ్, ఇన్‌స్పైరింగ్ జర్నీ లెగసీ.. ఆమె అచీవ్మెంట్‌తో రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు.

Next Story