- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో వాళ్ల దారి వాళ్లదే.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి. కానీ మన దగ్గర అలాంటి వాతావరణమే లేదు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గింది. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే అనేలా తయారైంది. తెలుగు సినిమాలకు ఏడు నేషనల్ అవార్డులు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీ స్పందించకముందే సైమా గుర్తించినందుకు ధన్యవాదాలు. సైమా వారి సన్మానాలు బూస్ట్ ఇస్తున్నాయి అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
కాగా, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (South Indian International Movie Awards 2025).. గతేడాది బాక్సాఫీస్‌ను పలకరించిన పలు చిత్రాలకు అవార్డులు ప్రదానం చేసింది. తెలుగులో పుష్ప2, కల్కి2898 ఏడీ, హనుమాన్ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో పాటు, కాసుల వర్షాన్ని కురిపించాయి. తాజాగా వీరికి సైమా ఆధ్వర్యంలో సన్మానాలు చేసి, అవార్డులు అందజేశారు.






