‘పవన్ సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను’.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా విడుదల వేళ థియేటర్‌లు బంద్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.

‘పవన్ సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను’.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా విడుదల వేళ థియేటర్‌లు బంద్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఓ నలుగురు నిర్మాతలు పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు విస్తృతమయ్యాయి. అయితే.. ఆ నలుగురు ఎవరు? ఎందుకు పదే పదే పవన్ సినిమాలను ఇబ్బంది పెడుతున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆదేశించారు. అయితే.. పవన్ సినిమాను అడ్డుతగిలే వారిలో అల్లు అరవింద్(Allu Aravind) కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.

‘ఆ నలుగురు.. ఆ నలుగురు అని వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. అసలు ఆ నలుగురిలో నేను లేను. వారితో అన్ని సంబంధాలు ఎప్పుడో తెంచుకున్నాను. తెలంగాణలో AAA తప్ప నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ఆంధ్రాలో కూడా కేవలం 15 లోపే ఉన్నాయి. దయచేసి ఆ నలుగురు అని వేసేటప్పుడు నా పేరు వాడకండి. నా వృత్తి సినిమా, సినిమానే నమ్ముకున్నాను. కావాలనే కొందరు నా దగ్గర థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు ఉన్నప్పుడు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకుంటారా.. అది దుస్సాహాసమే అవుతుంది. ఆ సాహసం కూడా ఎవరూ చేయకూడదు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా పవన్ తీర్చుతున్నారు. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరికాదు. గతంలో పవన్ కల్యాణ్‌ను తాము కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని తమకు పవన్ చెప్పారు. కానీ కొందరు కలవకుండా నిర్లక్ష్యం చేశారు. అందువల్ల లేట్ అయింది. ఏ వ్యాపారం అయినా సవ్యంగా ఉండాలనే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. కష్టం వచ్చినప్పుడు వెళ్లి కలిస్తే.. ప్రభుత్వాలు తీరుస్తాయి. ప్రభుత్వాలతో సంబంధం లేనప్పుడు గత సీఎంను ఎందుకు కలిశారు. పవన్ కల్యాణ్ పేషీ నుంచి వచ్చిన లేఖ చాలా సమర్థనీయం. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి.. కలిసి పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విషయాలకే థియేటర్లు మూసేస్తాం అనడం కరెక్ట్ కాదు’ అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.

Next Story