- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allari Naresh: మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైన అల్లరి నరేష్.. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్
అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. కమెడీయన్‌గానే కాకుండా.. ఈ మధ్య కాలంలో ‘నాంది’, ‘ఉగ్రం’ లాంటి సినిమాలు తీసి కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘రాధా’ ఫేమ్ డైరెక్టర్ చంద్ర మోహన్ (Chandra Mohan) దర్శకత్వం వహిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు టాప్ మోస్ట్ బ్యానర్లపై నిర్మించేందుకు చర్చలు నడుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘రంభ ఊర్వశీ మేనక’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. అయితే.. టైటిల్ విని ముగ్గురు హీరోయిన్లు, సోషియో ఫాంటసీ కథ అనుకుంటే పొరబడినట్లే. ఈసారి డైరెక్టర్ చంద్ర మోహన్ సరికొత్తగా ఆలోచించి.. టైటిల్ వెనకే గమ్మతైన కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కథ ఏమిటో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది అంటున్నాయి. ఫీలిమ్ వర్గాలు. ఏదేమైన టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. కాగా.. ‘బచ్చల మల్లి’ తర్వాత నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ’ అనే సినిమా చేశాడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. ఈ మూవీ అనంతరం ‘రంభ ఊర్విశీ మేనక’ చేయబోతున్నట్లు టాక్.






