Allari Naresh: ఇదొక కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ కొత్త సినిమాపై మేకర్స్ అప్డేట్

by Chukka Sudharani |

యూనిక్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్.. తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.

Allari Naresh: ఇదొక కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ కొత్త సినిమాపై మేకర్స్ అప్డేట్
X

దిశ, సినిమా: యూనిక్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్.. తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. నరేష్65 (Naresh65) తో తిరిగి కామెడీ జానర్‌లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ను చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్‌గా ఈ మూవీ లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హర్ష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్‌తో రిఫ్రెషింగ్‌గా ఉండబోతోందని.. ఇదొక కామెడీ గోస్ కాస్మిక్ అని మేకర్స్ ప్రకటించారు. అలాగే.. నరేష్65 రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.


Next Story