అల్లరి నరేశ్‌ ఇంట తీవ్ర విషాదం..

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నరేష్ తాతయ్య ఈదర వెంకట్రావు మంగళవారం (జనవరి 20) తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు.

అల్లరి నరేశ్‌ ఇంట తీవ్ర విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నరేష్ తాతయ్య ఈదర వెంకట్రావు మంగళవారం (జనవరి 20) తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. 90 ఏళ్ల వయసులో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరేష్, ఆర్యన్ రాజేష్ ల తండ్రి ఈవీవీ సత్యనారాయణకు తండ్రి ఈదర వెంకట్రావు. ఈయన భార్య వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. తమ తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రావు పార్థివ దేహానికి అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. వెంకట్రావు మరణం పట్ల టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story