Allari Naresh: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ రిలీజ్..

by Prasanna |
Allari Naresh: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ రిలీజ్..
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ ( Allari Naresh) హీరోగా సుబ్బు మంగదేవి డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ "బచ్చలపల్లి " ( Bachhala Malli ). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమృత అయ్యర్ ( amritha aiyer) హీరోయిన్ గా నటించగా.. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్నడూ లేని విధంగా అల్లరి నరేష్ మాస్ యాంగిల్ లో కనిపించి అందర్ని ఆకట్టుకున్నారు. చిన్న విషయానికి కూడా గొడవపడే వ్యక్తి ప్రేమలో పడి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? ఆ తర్వాత అతడు వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనే అంశాలతో ఈ సినిమాని తీసినట్లు తెలుస్తుంది.

1990 నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో న‌రేష్ మాస్ లుక్ లో మెరిశాడు. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాని తీశామని చిత్ర బృందం తెలిపింది. " నాంది " త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి ఊరమాస్ లుక్ లో కనిపించడంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మరి, ఈ సినిమాతో హిట్ కొడతాడో ? లేదనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed