- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘుబాబు వల్ల కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఆలీ
ఆలీ మాట్లాడుతూ... ఆది సినిమా పూర్తయిన తర్వాత రఘుబాబు ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా, ఆయనను చూసి కంపార్ట్మెంట్‌లోని మహిళలు భయపడి ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు. గంగిరెడ్డి పాత్ర ప్రభావం అంతలా ఉండేదని అలీ నవ్వుతూ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించారు. ఇక ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన రేసుగుర్రం చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా అలీ తన సహ నటుడు రఘుబాబుకు సంబంధించిన ఓ ఫన్నీ సంఘటనను గుర్తుచేశారు. అలీ మాట్లాడుతూ… మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి సినిమాలో రఘుబాబు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, ఆ సినిమాలో ఆయన నటనను చూసిన దర్శకుడు వి.వి. వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ఆది సినిమాలో గంగిరెడ్డి పాత్రకు రఘుబాబును ఎంపిక చేసినట్లు చెప్పారు.
స్వభావంగా రఘుబాబు చాలా సౌమ్యుడైనప్పటికీ, ఆ సినిమాలో మాత్రం విలన్‌గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారని అలీ తెలిపారు. సినిమా పూర్తయిన కొన్ని రోజుల తర్వాత రఘుబాబు ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా, ఆయనను చూసిన ఓ కంపార్ట్మెంట్‌లోని మహిళలు భయపడి ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు. ఆ టైంలో గంగిరెడ్డి పాత్ర ప్రభావం అంతలా ఉండేదని అలీ నవ్వుతూ వెల్లడించారు. ఇక ఆది సినిమాలో అలీ కూడా నటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు స్నేహితుడి పాత్రలో కనిపించి, తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.






