NC25కు ఆల్ సెట్.. డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-08-18 14:49:45  IST  )

‘తండేల్’ సక్సెస్ తర్వాత అక్కినేని హీరో నాగచైత్య (Naga Chaitanya) తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

NC25కు ఆల్ సెట్.. డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘తండేల్’ సక్సెస్ తర్వాత అక్కినేని హీరో నాగచైత్య (Naga Chaitanya) తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. చైతు కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి మొదట చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తన 25వ చిత్రాన్ని నాగచైతన్య శివకొరటాల (Koratala Siva) డైరెక్షన్‌లో చెయ్యబోతున్నట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చర్చలు జరపగా కథ ఆల్మోస్ట్ సెట్ అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఇందులో హీరోయిన్‌గా యంగ్ హీరోయిన్ మమితా బైజు(Mamita Baiju)ని ఫిక్స్ చేశారట మేకర్స్. దీనికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ DSP సంగీతం అందిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి టాక్. సోషల్ థ్రిల్లర్‌తో కూడిన కళాశాల ప్రేమకథగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ త్వరలో ఇవ్వనున్నట్లు టాక్. లింక్

Next Story