Alia Bhatt: రొమాంటిక్ చిత్రంలో ఆలియా భట్.. మరోసారి దర్శకుడిగా మారుతోన్న స్టార్ ప్రొడ్యూసర్

by Chukka Sudharani |

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకును ఆకట్టుకుంటున్న ఆలియా భట్.. త్వరలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్.

Alia Bhatt: రొమాంటిక్ చిత్రంలో ఆలియా భట్.. మరోసారి దర్శకుడిగా మారుతోన్న స్టార్ ప్రొడ్యూసర్
X

దిశ, సినిమా: ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకును ఆకట్టుకుంటున్న ఆలియా భట్.. త్వరలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్. బాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్.. ఈ సినిమాతో మళ్లీ డైరెక్షన్ వైపు అడుగులు వెయ్యనున్నడట. కరణ్ జోహార్ ఒకప్పుడు డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత, హీరో యష్ జోహార్ కుమారుడైన కరణ్ జోహార్.. కుచ్ కుచ్ హోతా హై సినిమాతో దర్శకునిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

తర్వాత పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన ఈయన.. ప్రస్తుతం నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లకు కరణ్ జోహార్ మళ్లీ దర్శకత్వంలోకి అడుగు పెట్టబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి టాక్. ఈయన దర్శకుడిగా ఓ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరెక్కించే పనిలో పడ్డాడట. ఇందులో హీరోయిన్‌గా ఆలియా భట్‌ను ఫిక్స్ చెయ్యగా.. హీరోగా విక్కీకౌశల్ లేదా రణ్‌బీర్‌కపూర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story