Alia Bhatt: మా ప్రైవేట్ లైఫ్‌కు భంగం కలిగిస్తున్నారు.. ఆ వీడియోలు వైరల్ చేయడంపై ఆలియా భట్ సీరియస్

by Chukka Sudharani |

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ ఆలియాభ‌ట్ (Alia Bhatt), ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) జంట.. తాజాగా ముంబైలో కొత్తగా తన ఇంటిని నిర్మించుకుంటున్నారు.

Alia Bhatt: మా ప్రైవేట్ లైఫ్‌కు భంగం కలిగిస్తున్నారు.. ఆ వీడియోలు వైరల్ చేయడంపై ఆలియా భట్ సీరియస్
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ ఆలియాభ‌ట్ (Alia Bhatt), ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) జంట.. తాజాగా ముంబైలో కొత్తగా తన ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇది దాదాపు రూ. 250 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ లగ్జరీ బిల్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై ఆలియా స్పందిస్తూ సీరియస్ నోట్ షేర్ చేసింది. ‘ముంబై లాంటి నగరంలో స్థలం చిన్నగా ఉండటం కారణంగా.. ఒకరి ఇంటి కిటికి నుంచి చూస్తే మరొకరి ఇళ్లు కనిపిస్తుంది. అది నేను అర్థం చేసుకోగలను.

కానీ ఇలా ఉండటం వల్ల ఎవరి ప్రైవేట్ నివాసాలను వీడియోలు, ఫొటోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టే హక్కు ఎవరికి లేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మా ఇంటిని మాకే తెలియకుండా అండ్ మా అనుమతి లేకుండా సోషల్ మీడియాకు చెందిన పలు వెబ్‌సైట్స్ రికార్డ్ చేసి ప్రసారం చేస్తున్నాయి. ఇది మా ప్రైవసీకి భంగం కలిగిస్తుంది. అలాగే.. తీవ్రమైన భద్రతా సమస్యగా ఇది పరిగణించబడుతుంది. అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత స్థలాన్ని వీడియోలు, ఫొటోలు తీయడం ‘కంటెంట్’ కాదు.. ఒకరి గోప్యతను ఉల్లంఘించడం అవుతుంది.. ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఫార్వర్డ్ చేసిన వీడియోలు తొలగించాల్సిందిగా కోరకుంటున్న’ అంటూ నోట్ షేర్ చేసింది ఆలియా. లింక్

Next Story