- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో తనను కోల్పోయా.. అలియా భట్ ఎమోషనల్
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ చిన్నతనంలో తాను అనుభవించిన అత్యంత పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకుంది. ఇప్పటికీ ఈ విషయం తనను బాధిస్తుందని చెప్పింది.

దిశ, సినిమా : బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ చిన్నతనంలో తాను అనుభవించిన అత్యంత పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకుంది. విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో తన బామ్మను ఏవిధంగా కోల్పోయిందో చెప్పుకొచ్చింది. అప్పటి ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన అలియా.. ఈ యాక్సిడెంట్ తమ ఫ్యామిలీపై చాలా ప్రభావం చూపిందని, రోడ్ సేఫ్టీ పట్ల తన అవగాహనను పెంచిందని తెలియజేసింది. అలియాకు 12 ఏళ్ల వయసున్నపుడు ఆమె బామ్మ(నానీ) తన భర్తతో కలిసి గుడికి వెళ్తుండగా ట్రక్ ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయినట్లు వెల్లడించింది. అప్పటి నుంచి తమ ఫ్యామిలీ ఒకలాంటి భయం పెరిగిపోయిందని, ప్రత్యేకించి తన సేఫ్టీ పట్ల తల్లి ఆందోళన చెందేదని చెప్పింది. అయితే అప్పుడు సేఫ్టీ పాటించినా, తాను తల్లి అయిన తర్వాత సేఫ్టీ విషయంలో తన దృక్పథం మారిందని.. తన బిడ్డ కోసమైనా మరింత బాధ్యతగా ఉంటున్నట్లు తెలిపింది.






