సిగరెట్ తాగుతూ కనిపించిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ఈ మధ్య కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లిని ఇంట్రడ్యూజ్ చేశారు మేకర్స్.

సిగరెట్ తాగుతూ కనిపించిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ఈ మధ్య కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లిని ఇంట్రడ్యూజ్ చేశారు మేకర్స్. కాగా తాజాగా శృతి హాసన్ ఇందులో నటిస్తున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించారు. ఆమె బర్త్ డే సందర్భంగా ట్రయల్‌బ్లేజర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు .. అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం ఆకట్టుకుంది. పెదవులపై ఉన్న సిగరెట్‌, దాని నుంచి ఎగిసిపడుతున్న పొగ ఆమె పాత్రకు రఫ్‌, గ్రిట్టీ టచ్‌ను జోడిస్తోంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ఆమె ప్రజెన్స్ పవర్ ఫుల్‌గా ఉండబోతోంది. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.

Next Story