Sobhitha Dhulipala: నిజంగా ఉత్కంఠభరితమైన విషయం అంటూ అక్కినేని కోడలు పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-26 15:14:48  IST  )

మోడల్ నటి శోభితా దూళిపాళ(Sobhitha Dhulipala) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Sobhitha Dhulipala: నిజంగా ఉత్కంఠభరితమైన విషయం అంటూ అక్కినేని కోడలు పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: మోడల్ నటి శోభిత దూళిపాళ(Sobhitha Dhulipala) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను పెళ్లి చేసుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఒకేసారి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు కొత్త సినిమా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. పలు ఫొటోలు(Photos) షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, శోభిత సబ్యసాచి 25వ వార్షికోత్సవంలో పాల్గొంది.

ముంబై(Mumbai)లోని ఎన్‌ఎంసీసీ(NMCC)లో జరిగిన ఈ వేడుకకు 600 మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఇందులో చాలామంది సినీ సెలబ్రిటీలు పాల్గొని తమ ఫ్యాషన్ షోతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. శోభిత కూడా యానిమల్ ప్రింటెడ్ ఫుల్ బాడీ లాంగ్ లెన్త్ గౌన్ ధరించి హాట్ పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ‘‘ఇది మేము మరొక రాజ్యం ద్వారాల వద్ద ఉన్నప్పటికీ, ఒక రకమైన మరణానంతర జీవితానికి నాంది. నిజంగా ఉత్కంఠభరితమైనది. మాస్ట్రోకి 25 సంవత్సరాలు నిండినందుకు అభినందనలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు గార్జియస్ అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అలాగే కొందరు మాత్రం సమంతను కాపీ కొట్టావ్ కదా అని అంటుండగా.. ఓ నెటిజన్ మాత్రం మ్యారిడ్ లైఫ్ ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు.

Next Story