Shobitha Dhulipala: పెళ్లైన రెండు నెలలకే కీలక నిర్ణయం తీసుకున్న అక్కినేని కోడలు.. ఆమెను ఫాలో అవుతుందా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-17 11:40:11  IST  )

యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) అందరికీ సుపరిచితమే. ఆమె పొన్నియన్ సెల్వన్-1,2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

Shobitha Dhulipala: పెళ్లైన రెండు నెలలకే కీలక నిర్ణయం తీసుకున్న అక్కినేని కోడలు.. ఆమెను ఫాలో అవుతుందా?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) అందరికీ సుపరిచితమే. ఆమె పొన్నియన్ సెల్వన్-1,2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మంకీ మ్యాన్, లవ్ సితార చిత్రాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో కొద్ది కాలం పాటు డేటింగ్ చేసిన ఆమె గత ఏడాది పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి కోడలు అయిపోయింది. దీంతో శోభిత ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇక పెళ్లి తర్వాత నుంచి ఇంటి బాధ్యతలు తీసుకున్న ఆమె సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన ‘తండేల్’(Thandel) మూవీ సక్సెస్ మీట్‌లో కనిపించి అందరినీ ఫిదా చేసింది. కానీ కొత్త సినిమాలు మాత్రం ప్రకటించడం లేదు. దీంతో అందరి హీరోయిన్స్‌లా శోభిత కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందనే చర్చ మొదలైంది.

శోభిత ధూళిపాళ నెక్ట్స్ తల్లి అయి ఇంటికే పరిమితం అవుతుందా లేక సినిమాల్లో నటిస్తుందా? అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో.. తాజాగా, అక్కినేని కోడలుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇంతకుముందులా బోల్డ్‌గా నటించొద్దని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో నటించినా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేలా జాగ్రత్త పడుతుందట. తనవల్ల అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక ఆమె మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ కోసం సినిమాలు కూడా ఆపేయడానికి వీరిద్దరు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story