Naga Chaitanya-Sobitha: గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని నాగచైతన్య-శోభిత.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-28 13:20:11  IST  )

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobitha Dhulipala)కొద్ది కాలంపాటు డేటింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

Naga Chaitanya-Sobitha: గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని నాగచైతన్య-శోభిత.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobitha Dhulipala)కొద్ది కాలంపాటు డేటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సంగతి బయటకు రాకుండా సీక్రెట్‌గా పలు చోట్లకు వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. వీరికి సంబంధించిన ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించి తమ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే.. నాగార్జున(Nagarjuna) ఈ జంటకు నిశ్చితార్థం జరిపించారు. ఇక ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన కొడుకు, కోడలును ఆశీర్వదించాలని అన్నారు. అయితే గత ఏడాది చైతు, శోభిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు, పలువురు సినీ స్టార్స్ మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఇక అప్పటి నుంచి శోభిత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఇక నాగచైతన్య విషయానికొస్తే.. పెళ్లి తర్వాత నటించిన ‘తండేల్’(Thandel) ఘన విషయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి కొద్ది రోజులు బాక్సాఫీసు వద్ద రాణించింది. అయితే చైతు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శోభితతో వెకేషన్స్‌కు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య, శోభిత సోషల్ మీడియా ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించారు. సుజి పేరుతో తాము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు.

‘‘అందరికీ నమస్కారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన తినుబండారాల నుండి ఆహారాన్ని, రుచులను శాంపిల్ చేయడానికి ఇన్నాళ్లకు సమయం కుదిరింది. ఉత్సాహంతో ‘షోయు’ ని పరిచయం చేశాను. మాకు లభించిన ప్రేమ, అద్భుతమైన కొత్త భాగస్వాములతో మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు నన్ను ప్రేరేపించింది. మేము సాంప్రదాయ వంటకాలను చేస్తాము. మా మెనూతో ఉల్లాసభరితమైన మార్గాలను కనుగొంటామని మీకు మాట ఇస్తున్నాము. మీరు దీన్ని ఆనందిస్తారని, ఆస్వాదిస్తారని ప్రతి బైట్‌లో మా ప్రేమను గుర్తిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇండియా మొత్తం సరఫరా చేస్తాము’’ అని రాసుకొచ్చారు. అలాగే పలు ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాకూడా పంపండి అన్నా అని కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story