- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 ఇయర్స్ అంటూ ఆమెతో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోను షేర్ చేసిన అక్కినేని హీరో.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు..
అక్కినేని హీరో సుమంత్(Sumanth) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో సుమంత్(Sumanth) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి మంచి హిట్స్ అందించిన సుమంత్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘అనగనగా’(Anaganaga) అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఆ చిత్రంతో మరోసారి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇతను నటించిన చిత్రాల్లో ‘మళ్లీ రావా’(Malli Raava) మూవీ ఒకటి.
2017లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా సినిమాకు గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వం వహించగా.. రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka) నిర్మించారు. ఇక ఇందులో సుమంత్ సరసన ఆకాంక్ష సింగ్(Akanksha singh) హీరోయిన్‌గా నటించింది. ఇక అప్పట్లో రిలీజ్ అయిన ఈ చిత్రం సుమంత్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయి నేటికి 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది.
ఈ సందర్భంగా హీరో సుమంత్ తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. అందులో మళ్లీ రావా మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ 8 ఇయర్స్.. అనే ట్వీట్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో సుమంత్ బ్లాక్ సూట్‌లో ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న హీరోయిన్ ఆకాంక్ష బుగ్గను నిమురుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నారు.






