- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రగ్గడ్ లుక్ నుండి స్టైలిష్ లుక్ వరకు సూపర్ అనిపిస్తున్న అక్కినేని హీరో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్యకు సంబంధించిన లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో చై చాలా హ్యాండ్ సమ్ అండ్ క్యూట్‌గా కనిపించాడు. డిఫరెంట్ లుక్ వారెవ్వా అనిపించాడు. రగ్గడ్ లుక్ నుండి స్టైలిష్ లుక్ వరకు సూపర్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






