కాబోయే భార్యతో షికారుకు వెళ్తున్న అక్కినేని హీరో.. క్యూట్ పెయిర్ అంటున్న నెటిజన్లు(వీడియో)

by Gugulothu.Kavitha |

అక్కినేని హీరో నాగార్జున(Nagarjuna) తనయుడు అఖిల్(Akhil) అందరికీ సుపరిచితమే.

కాబోయే భార్యతో షికారుకు వెళ్తున్న అక్కినేని హీరో.. క్యూట్ పెయిర్ అంటున్న నెటిజన్లు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగార్జున(Nagarjuna) తనయుడు అఖిల్(Akhil) అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ‘లెనిన్’(Lenin) మూవీలో నటిస్తున్నాడు. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు(Murali Kishore Abooru) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. బడా బిజినెస్ మ్యాన్ కూతురు అయినటువంటి జైనాబ్ రవడ్జీ(Zainab Ravadzee)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్(X) వేదికగా వెల్లడిస్తూ వీరి ఎంగేజ్‌మెంట ఫొటోస్ షేర్ చేశాడు. దీంతో ఆ విషయం కాస్తా నెట్టింట అందరికీ తెలిసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనాబ్‌తో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వెళ్తూ ఈ జంట మీడియాకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు పెళ్లికి ముందు భార్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని, క్యూట్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story